సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో జాగ్రత్త!
నేటి సమాజంలో రోజులు గడిచేకొద్దీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మానవులు జీవితాలను గడిపేస్తున్నా రు. ప్రస్తుతం కాలంలో ప్రతీ ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపుతున్న వాటిలో ఇంటర్నెట్ ప్రథమంగా ఉంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో మునిగి తేలుతున్నారు.
కొందరైతే సోషల్ మీడియాకు బానిసలుగా మారుతూ జీవితాలను నాశనం చేసుకుంటుంటే, మరి కొందరు సోషల్ మీడియా పుణ్యమా అని మానవ సంబంధాలకు మచ్చ తె స్తున్నారు. యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా కారణం గా ఇటీవల జరుగుతున్న సంఘనటలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు మోసాలకు తెరతీస్తున్నాయి. డబ్బులు పోగొట్టుకోవడం, అక్రమ సంబంధాలు లాంటి కేసులు పెరిగిపోతున్నాయి.
సోషల్ మీడియా వినియోగించడం తప్పు అని ఎవరు చెప్పడం లేదు. కానీ దానిని వినియోగించే తీరు మారాలి. సాంకేతికత, విజ్ఞానం పెరిగే కొద్ది సోషల్ మీడియా ప్రభావం కూడా పెరిగిపోతున్నది. సాంకేతికత అనేది జీవితంలో ఉన్నతస్థాయి చేరడానికి ఉపయోగపడాలే తప్ప వికృత చేష్టలతో కాలం వృధా చేయకూడదన్న విషయం గుర్తించాలి.
వంశీకృష్ణ గౌడ్, వరంగల్




