రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
అమరవరపు ప్రేమ్ కుమార్
గరిడేపల్లి, జూన్ 26: భద్రత అంశాలతో రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని స్వేరోస్ రాష్ట్ర యువజన నాయకులు అమరవరపు ప్రేమ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 26 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రాల్లో పోలీస్ శాఖలు సేవలందించిన మాజీ ఐపీఎస్ అధికారి డా..ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కు కల్పిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం భద్రతా సిబ్బందిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రవీణ్ కుమార్ కు గత ప్రభుత్వాలు భద్రత కల్పిస్తే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నందుకే రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తగ్గించే ప్రయత్నాలు జరగటం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తగ్గిస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో నాగేందర్,నవీన్,కిషోర్,నరేష్ నాయక్,శ్రీను నాయక్, అంజిరెడ్డి పాల్గొన్నారు.






