31 July, 2026 | 12:37 AM

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

03-09-2025 12:54 AM

ఎస్పీ మహేష్ బి. గీతె

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) జిల్లాలోసైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి మహేష్ బి. గితే అన్నారు. మంగళవారం పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాలులు వికాస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మహేష్ బి. గీతే మాట్లాడుతూ సైబర్ సెల్ నేరాల బారిన పడుతున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అన్నారు.

అత్యాశకు పోయి మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ నేరానికి గురైనప్పుడు 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కృష్ణ, సైబర్ సెల్ ఆర్ ఎస్ .ఐ . జువైద్, వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్, కళాశాల నిర్వాహకులు విద్యార్థులుపాల్గొన్నారు.