మాజీ సర్పంచ్ నకేరికంటి ప్రసాదు మృతి బాధాకరం
అంత్యక్రియలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ పార్టీ నాయకులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ తాజా సర్పంచ్ యువ నాయకుడు నకిరేకంటి ప్రసాద్ యాక్సిడెంట్ జరిగి నాలుగు నెలలుగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.పార్టీ నాయకులు,మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు గ్రామస్తులు ఆయన మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు.పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ.ఆయన పార్టీకి,గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. వారి కుటుంబాన్ని బి.ఆర్.ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని పలువురు నాయకులు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు.
ప్రసాద్ సేవలు మరువలేనివి: మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
కొత్తగూడెం మాజీ సర్పంచ్ యువ నాయకుడు నకిరేకంటి ప్రసాద్ మృతి బాధాకరమని హుజూర్నగర్ మాజీ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు యువ నాయకుడైన ప్రసాద్ కు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉందని అటువంటి నాయకుడు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ చనిపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.ఈ ప్రాంత రాజకీయాల్లో ఆయన మృతి తీరనిలోటు అని పేర్కొన్నారు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపి భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మంగళవారం జరిగిన అంత్యక్రియలో శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.






