10-11-2025 12:00:00 AM
ముషీరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ సైబర్ అవేర్నెస్ ఉన్నప్పటికీ పెరుగు తున్న బాధితులు, సైబర్ నేరాలు, మోసాలసంఘటనలపై, డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటానికి నివారణ చర్యలపై శనివారం సిటీ పోలీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కవాడిగూడ కమ్యూ నిటీ హాల్‌లో ఆదివారం ప్రజలకు సైబర్ సింబా ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి, నగర సీపి వీసి సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా, ఫోన్ కాల్, ఆన్లైన్ ఇంట్రక్షన్ తోనే సైబర్ కేటుగాళ్లు నేరాలు చేస్తున్నారని తెలిపారు. పాత నేరస్థుల మాదిరిగానే, కొత్త నేరస్తులు కూడా డేటాను సులభంగా సేకరిస్తున్నారని, ఎవరు ధనవంతులు? ఏ లొకేషన్ లో ఎవరు ఉంటారు? వయసు లింగం వంటి వివరాలు అన్ని తెలుసుకొని వారినే లక్ష్యం గా సైబర్ మోసగాళ్లు ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇది సాధారణ సమ స్య కాదని ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని పేర్కొన్నారు. సైబర్ అవేర్నెస్ గురించి ప్రతి ఒకరు పదిమందికి 10 మంది 20 మందికి ఇలా చెప్తే దీనిని ఒక మూవ్ మెంట్ అవుతుందని ఉద్ఘడ్డించారు. ఏదైనా మోసం జరిగిన వెంటనే బాధితులు 1930 నెంబర్ కాల్ చేసి పిర్యాదు చేయాలనిసూచించారు.