calender_icon.png 10 November, 2025 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దు

10-11-2025 12:00:00 AM

మేడ్చల్, మల్కాజిగిరి డబుల్ బెడ్ రూం జేఏసీ

ముషీరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): సిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్.డబ్ల్యూ.ఎ) పేరుతో డబుల్ బేడ్ రూమ్ లబ్ధిదారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టొద్దని, ఆర్‌డబ్ల్యూఎను వెంటనే వెనక్కి తీసుకో కపోతే పోరాటం సాగిస్తామని మేడ్చల్ మల్కాజ్గిరి డబుల్ బెడ్ రూం జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్  ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వినర్ లు నర్సింగరావు, పెంటయ్య, వినోద్ కుమార్, శేఖర్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ చారీ, వెంకటేష్, నరేష్ గౌడ్ మాట్లాడారు.

గత కొన్ని రోజుల క్రితం అహ్మద్గూడ డబుల్ బేడ్ రూమ్ లను సందర్శించిన జిల్లా కలెక్టర్ 18 సమస్యలను గుర్తించి, వాటిని త్వరగా పరిష్కరిస్తానని వాగ్ధానంనం చేశారని, ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. ఆర్.డబ్ల్యూ.ఎ ఎలక్ష న్ల నిర్వహణలో సుమారు రూ.10 లక్షల ప్రజా ధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.

ఇప్పుడు సెంట్రల్ కమిటీ ఎలక్షన్లు అంటూ ఆర్.డబ్ల్యూ.ఏ సంబంధించి రెండు పేపర్లు రిలీజ్ చేశారని తెలిపారు. వాటిలో భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్, మంచినీటి పైపుల మరమ్మత్తు, నిర్వహణ, స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్లు, పార్క్ మెయింటెనెన్స్, ఎస్.టీ.పీ మెయింటెనెన్స్, ఎఎంసీలు ఉన్నాయని అన్నారు. ఇవి ప్రజలపై విధించితే, ప్రతి లబ్ధిదారునికి నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు భారం పడుతుందన్నారు.