2 July, 2026 | 10:49 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

28-06-2025 12:11 AM

-ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

-నెలవారీ క్రైం రివ్యూలో ఎస్పీ శ్రీనివాసరావు

మెదక్, జూన్ 27(విజయక్రాంతి): సమాజంలో సైబర్ మోసాల వల్ల జరిగే నష్టాలే అధికంగా ఉన్నాయని, పోలీసు అధికారులు అందరూ కూడా సైబర్ నేరాలు జరగకుండా, మూడనమ్మకాల పైన, గంజాయికి బానిస కాకుండా  అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నెల వారి క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ గ్రేవ్, ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం చేయరాదని ఆదేశించారు. మిస్సింగ్ కేసులపై కూడా ఆరా తీసి పురోగతి సాధించాలని సూచించారు.

ఎస్త్స్ర, సీఐ స్థాయి వరకు కూడా విజిబుల్ పోలిసింగ్ లో అందరూ కచ్చితంగా పాల్గొనాలని, దీనివల్ల సంఘవిద్రోహ శక్తులను కట్టడి చేస్తూ ప్రజలకు భరోసా కల్పించవచ్చని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో సమాజం నుండి సహకారం తీసుకోవాలని, రౌడీ షీటర్లను, అనుమానితులను నిరంతరం గమనించాలని తెలిపారు.

మైనర్లు, మద్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిని పట్టుకొని అవసరమైతే లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో  జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్గౌడ్, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.