15 August, 2026 | 6:13 PM

ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి ఉండాలి

28-06-2025 12:11 AM

డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ఉద్యోగులు, ప్రెస్ రిపోర్టర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌మీట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి షటిల్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో పాల్గొని అందరిలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

జీహెచ్‌ఎంసీ నిర్వహించిన ఈ ప్రత్యేక క్రీడా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ స్పోర్ట్స్‌మీట్ ద్వారా కార్పొరేటర్లు, ఉద్యోగులు, ప్రెస్ రిపోర్టర్ల మధ్య ఐక్యత ఏర్పడిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతిఒక్కరిలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.