calender_icon.png 6 December, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యం..

06-12-2025 05:09:48 PM

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలే నిర్వహణ లక్ష్యంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలలో భాగంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న స్టాటిక్ సర్వేలేయన్స్ చెక్ పోస్ట్ ను రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం  సందర్శించారు. వాహన తనిఖీల వివరాల రిజిస్టర్ ను సీపీ తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను అక్రమ రవాణాకు ప్రయత్నించే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అట్టి వాహనాల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.

సిబ్బంది వాహనాలను తనిఖీ సమయంలో తగిన జాగ్రత్తలు రేడియయం జాకెట్స్ వేసుకోవాలని, లైట్స్ అందుబాటులో ఉంచుకోవాలని స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి జోన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని చెక్ పోస్ట్ ల్ వద్ద నిత్యం వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్బంగా సీపీ తెలిపారు.

అనంతరం గర్రెపల్లి మేజర్ గ్రామ పంచాయతీ, సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమీషనర్ సందర్శించారు. ముందస్తు సమాచారాల్ని సేకరించి ఏలాంటి సంఘటనలు ప్రచారం సమయంలో, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున, ఫలితాలు వెల్లడించిన తరువాత ఎలాంటి అవాంఛిత ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటులు అమలు చేయాలని, ఏ సమాచారం వచ్చినా, వెంటనే స్పందన తప్పనిసరి” అని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై, ట్రబుల్ మాంగర్స్ పై 24/7 పర్యవేక్షణ  ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.