ఎంజీయూలో బీఈడీ పరీక్షలు ప్రారంభం
05-08-2026 12:17 AM
నల్లగొండ టౌన్, ఆగస్టు 4: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ 2వ, 4వ సెమిస్టర్ రెగ్యులర్ 1వ, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను మంగళవారం నుండి 13 కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఎంజియూ పరీక్షల నియంత్రణాధికారి డా. జి. ఉ పేందర్ రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాలను అయన పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలు రాయాలని సూచించారు.






