పిల్లలు లేరనే బాధతో బీడీ కార్మికుడి ఆత్మహత్య
04-03-2026 12:19 AM
రాజగోపాల్ పేటలో విషాదం
నంగునూరు, మార్చి 3:పిల్లలు లేరనే మనస్తాపంతో ఓ వ్యక్తి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంగునూరు మం డలం రాజగోపాల్పేట గ్రామంలో చోటుచేసుకుంది.రాజగోపాలపేట పోలీసుల వివరా ల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకుబత్తిని శ్రీనివాస్ (49) గత 15 ఏళ్లుగా సిద్దిపేటలో ఉంటూ,భార్య కవితతో కలిసి బీడీ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు.
పెళ్లయి 27 ఏళ్లు గడిచినా పిల్లలు కలగకపోవడంతో మనస్తాపం చెంది రాజగోపాల్పేట పెద్ద చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ స్థుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి,పోస్టుమార్టం నిమిత్తం సిద్ది పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు అధికారి ఆర్. రంగరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




