27-04-2025 12:00:00 AM
దాంపత్య జీవితంలో గొడవలైనా, ఏ విషయంలోనైనా ఇద్దరి మధ్య తప్పులు జరగడం సహజం. విడాకులే ఏకైక పరిష్కారం అనుకుంటున్నారు ఈతరం దంపతులు. కానీ ఇలా వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకోవడం కంటే కాస్త ఓపిక వహించి రిపేర్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ‘ట్రయల్ సెపరేషన్’ పద్ధతి మేలంటున్నారు. భేదాభిప్రాయాలొచ్చిన జంటలు విడాకులు తీసుకోకుండా..
కొంతకాలం పాటు దూరంగా ఉండటమే ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వేర్వేరూ ఇళ్లలో నివసించవచ్చు. ఆర్థికంగా, ఇతర కారణాల రీత్యా అది కుదరకపోయినా.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో జీవనం కొనసాగించవచ్చు. సాధారణంగా ఇలా దూరమైతేనే ప్రేమలు పెరుగుతుంటాయి.
ట్రయల్ సెపరేషన్‌లోనూ ఇదే జరుగుతుందంటున్నారు నిపుణులు. ఇద్దరూ ఇలా విడిపోయి కలిసుండటం వల్ల భాగస్వామి విలువేంటో, వారిని ఎంతగా మిస్సవుతున్నారో తెలిసొస్తుంది. ఈ భావనలు ఇద్దరు కలుకునేందుకు దోహదం చేస్తాయంటున్నారు. ఈ పాజిటివిటీనే అనుబంధాన్ని తిరిగి కలుపుతుందని చెబుతున్నారు.