calender_icon.png 10 November, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు: ఎమ్మెల్యే కోరం

10-11-2025 01:16:08 PM

ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి  సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు, రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్య ఎజెండా, రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ప్రజలను మోసం చేసే దళారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాటిని అరికట్టే విధంగా చూడాలి అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.