29 April, 2026 | 3:26 AM

బేగంపేట్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

29-04-2026 01:14 AM

ఏసీపీ జీ శంకర్ రాజ్  నేతృత్వంలో తనిఖీలు

సికింద్రాబాద్, ఏప్రిల్28 (విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఆదే శాల మేరకు మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ కే రాహుల్ రెడ్డి సూచనలతో మంగళవారం బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్కాజిగిరి అదనపు డీసీపీ షాకీర్ హుస్సే న్, తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్ రాజ్ ఆధ్వర్యంలో శబ్ద కాలుష్యం సైలెన్సర్ల, నంబర్ ప్లేట్ ఉల్లంఘన, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనం నడపడం ట్రాఫిక్ ఉల్లంఘనలపై బేగంపేట ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

మల్కాజిగిరి కమిషనరేట్ బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి ముఖ్య ప్రాంతాలలో వాహనదారులు, ప్రజల భద్రత దృష్ట్యా చర్యలలో భాగంగా హెచ్‌పీఎస్ అవుట్‌గేట్, ర సూల్‌పురా, సిటిఓ జంక్షన్ మరియు బోయి న్‌పల్లి  వద్ద టింటెడ్ గ్లాస్/బ్లాక్ ఫిల్మ్ పై ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టమన్నారు.ఈ సందర్భంగా టింటెడ్ గ్లాస్/ బ్లాక్ ఫిల్మ్ కలిగివన్న 150 వాహన యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలియ జేశారు. ఈ తనిఖీల్లో బేగంపేట్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జీ.జానకి రాముడు, సబ్ ఇన్‌స్పెక్టర్లు ఇ హరీష్ గౌడ్, శివరాజ్, అశోక్‌రెడ్డి, దేవిదాస్, సతీష్, ట్రాఫి క్ కానిస్టేబుల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.