29 April, 2026 | 3:24 AM

అంగన్వాడీ కేంద్రాల్లో ఆధునిక వసతులు

29-04-2026 01:15 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి

ముషీరాబాద్,ఏప్రిల్ 28(విజయక్రాంతి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహకారం తో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 35 అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక వసతులతో తీర్చిదిద్దారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి తెలిపారు.

మంగళవారం ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్ లోగల అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులతో చేపట్టిన ఆధునిక వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్, బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భరత్ గౌడ్, రమేష్ రామ్, పార్టీ సీనియర్ నాయకులు నవీన్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, పార్టీ నాయకులు బద్రినారాయణ, లక్ష్మణ్, సత్యనారాయణ, గడ్డం నవీన్ తదితరులు పాల్గొన్నారు.