బెజ్జంకి జాతర వేలం..పెరిగిన ఆదాయం
బెజ్జంకి,మార్చి20:సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఈనెల 29 ప్రారంభం కానున్నాయి, ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ఈవో జాతర వేలం పాటను నిర్వహించారు . భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని,వ్యాపారుల పోటీతో కాంట్రాక్టులు భారీ ధరలకు వెళ్లాయి.జాతరలో కొబ్బరికాయల కాంట్రాక్ట్ 2,56,000, లడ్డుపులిహోర 5,70,000, తైబజార్ 1,13,000, దైవ దర్శనం 2,36,000, ప్యాలలుపుట్నలు 1,50,000,
దివిటీలు 22,000లకు వేల రూపాయలకు కాంట్రాక్టులు దక్కించు కున్నారు.ఈ ఏడాది వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం గత సంవత్సరం కంటే 3,02,800 అధికంగా నమోదైంది.దేవస్థానం ఈఓ మాట్లాడుతూ వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. చైర్మన్ జెల్ల ప్రభాకర్ మాట్లాడుతూ వచ్చిన ఆదాయంతో అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ బొల్లాం శ్రీధర్ జాతర విజయవంతానికి గ్రామ ప్రజల సహకారించాలిని కోరారు .




