13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నీటి కోసం తిప్పలు పడుతున్న బెజ్గం చెరువు తండా గ్రామపంచాయతీ

23-03-2026 10:47 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బెజ్గం చెరువు తండా పంచాయతీ(Bejugam cheruvu Thanda Gram Panchayat) తాగునీటి కోసం అలమటిస్తూ తిప్పలు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తాగునీటి కోసం కిలోమీటర్ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని,గ్రామ సభలో వినిపించిన ఫిర్యాదుకు సమాధానం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త బోర్, మోటార్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. బెజ్గం చెరువు తండా జిపి పరిధిలో తాగునీటి సమస్య రోజురోజుకు తలెత్తుతుందని, గత మూడు నెలలుగా పాతబోరు పనిచేయకపోవడంతో తండా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.తాగునీటి కోసం మహిళలు పిల్లలు గ్రామస్తులు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.

తాగునీటి సమస్యపై రెండుసార్లు గ్రామసభలో సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాగునీటి సమస్య పరిష్కారం కోసం తండావాసులు స్వయంగా కొత్త మోటర్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావడంతో సర్పంచ్,ఉప సర్పంచ్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.తండవాసుల తాగునీటి సమస్య పరిష్కరించవలసిన బాధ్యత ఉండవలసింది.కానీ ప్రజా ప్రతినిధులు అడ్డంకులు సృష్టించడం బాధాకరమని తండావాసులు తెలుపుతున్నారు.ఇప్పటికైనా నీటి సమస్యపై మండల అధికారులు జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పరిస్థితిని పరిశీలించి కొత్త బోర్ మోటార్ తవ్వడానికి అనుమతులు ఇచ్చి తండ ప్రజల నీటి సమస్యలు తొలగించాలని కోరుతున్నారు.