బీసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా బెల్లంకొండ రామ్మూర్తి
- హక్కుల కోసం రాజీలేని పోరాటం కొనసాగించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, మార్చి 13(విజయక్రాంతి): బీసీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (బీసీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యాపేటకు చెందిన బెల్లంకొండ రామ్మూర్తి, అదనపు ప్రధానకార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్ గోపాలకృష్ణ చారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాదులోని బీసీ భవన్‌లో బీసీ ఉపాధ్యాయ సంఘం బీసీటీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి బీసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కొన్నెడ శంకర్‌గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా బలోపే తం చేయడంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని జిల్లా అధ్యక్షులు ప్రతిపాదించారు. దీనితో బీసీ ఉపాధ్యాయ సంఘం లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన బెల్లంకొండ రామ్మూర్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా, అదనపు ప్రధానకార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్ గోపాలకృష్ణ చారిని సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రభుత్వపాఠశాలలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయులలో బీసీ ఉపాధ్యాయులు 60 శాతం ఉన్నారని, వారి హక్కుల కోసం, బీసీ ఉపాధ్యాయులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్ల కోసం రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఆకునూరి మురళి కమిటీ రిపోర్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మిన హాయింపు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, పీఆర్సీని 50 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని సమావేశంలో తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో బీసీ ఉపాధ్యాయ సంఘా ల నేతలు మాడవీటి వినోద్, వీరప్ప, గోపాలకృష్ణ, రాధాకృష్ణ, నవీన్‌గౌడ్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.




