14 March, 2026 | 2:35 AM

ఘనంగా మాంగళ్య షాపింగ్ మాల్ 30వ శాఖ ప్రారంభం

14-03-2026 01:22 AM

ఖమ్మం, మార్చి 13 (విజయక్రాంతి): 2012లో వరంగల్‌లో ప్రారంభమైన మాం గళ్య షాపింగ్ మాల్, వస్త్ర వ్యాపార రంగం లో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల ఆదరణను పొందిన మాంగళ్య, ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తన ఉనికిని చాటింది. ఈ క్రమంలో ఖమ్మంలో 30వ శాఖను ఘనంగా ప్రారంభించింది.

ఈ ప్రారంభోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో దశాబ్దాల అనుభవంతో నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ మూడు రాష్ట్రాల ప్రజలకు విశేష సేవలందిస్తున్న మాంగళ్య యాజమాన్యం పీఎన్ మూర్తి, కాసం నమఃశివాయ బ్రదర్స్‌కు రాష్ట్ర ప్రభు త్వం తరఫున అభినందనలు తెలిపారు. ప్రముఖ సినీ నటి శ్రీలీల ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్లోని వివిధ విభాగాలను సందర్శించి, అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు.

అనంతరం శ్రీలీల మాట్లాడుతూ ఖమ్మం ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్‌ను మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉంది అన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే మా విజయ రహస్యం అని తెలిపారు.

మా స్వంత హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఆధునిక మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్ చేసి, వస్త్ర వ్యాపారంలో ముందంజలో కొనసాగుతున్నామన్నారు. మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాషన్ కలెక్షన్స్, వివాహాలు, శుభకార్యాలకు ప్రత్యేకమైన భారీ వెడ్డింగ్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి.  కార్యక్రమంలో డైరెక్టర్లు విశాల్, వరుణ్, కార్తిక్, అరుణ్, పనీత్, సాయి కృష్ణ  పాల్గొన్నారు.