21-08-2025 11:37:06 AM
విందులు.. రోడ్డుపై చిందులు...
వాట్సాప్ గ్రూపుల్లో వైరల్
బెల్లంపల్లిఅర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(Bellampalli MLA Gaddam Vinod) అనుచర గణం మద్యం తాగి రోడ్డుపై వేసిన చిందులు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో సాక్షాత్తు ఎమ్మెల్యే పిఏ రామకృష్ణతో పాటు ప్రధాన అనుచరులు ఉండటం గమనార్హం. రోడ్డుపై వేసిన చిందులు బెల్లంపల్లిలో వాట్సాప్ గ్రూపులో వైరల్ గా మారాయి.
ఈ వీడియో దృశ్యాలను వాట్సాప్ గ్రూపులో చూసిన ప్రతి ఒక్కరు నవ్వుకోవడం కనిపించింది. మరికొందరు ఇదేమీ విడ్డూరమని అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్థానికంగా పర్యటించారు. ఆ క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. విందులు అరగించి జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై రాత్రి ఎమ్మెల్యే అనుచర బృందం నృత్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. సిగ్గు ఎగ్గు వదిలి ఎంత బరితెగింపుకి దిగజారడం పై వాడి వేడిగా చర్చ జరుగుతున్నది. అనుచరుల వ్యవహారంతో ఎమ్మెల్యే పరువును మరోసారి గంగపాలు అయినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.