21-08-2025 01:43:44 PM
చిట్యాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గణేష్ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల నూతన కమిటీని స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు తాటి పెళ్లి శ్రీనివాస్ తెలిపారు. ఉత్సవాల కమిటీ అధ్యక్షుడిగా వల్లాల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా క్యాతరాజు మల్లేష్, మేడిపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మైదం శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా ఉయ్యాల రమేష్, కోశాధికారిగా చిలగాని నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా ఓదెల శ్రీహరి, ఈగ కోటేశ్వర్, మహమ్మద్ అక్బర్, మామిడి శెట్టి తిరుపతి, చింతకింది దశరథం, భీమారం ప్రమీల, పట్టేం రాజు, మహమ్మద్ వలి, పోతుగంటి సంతోష్ లను ఎన్నుకున్నట్లు ఆయన వివరించారు.