calender_icon.png 21 August, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికేతరులతో జీవనోపాధి కోల్పోతున్నాం

21-08-2025 12:55:55 PM

నేడు స్వచ్ఛందంగా టైర్ల షాపులు బంద్.

కాకతీయ టైర్ ఫైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్.

హనుమకొండ అధ్యక్షుడు కే నగేష్.          

హనుమకొండ,(విజయక్రాంతి): స్థానికేతరులతో జీవనోపాధి కోల్పోతున్నామనీ, నేడు స్వచ్ఛందంగా టైర్ల షాపులు బంద్ చేయనున్నట్లు కాకతీయ టైర్ ఫైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, హనుమకొండ అధ్యక్షుడు కే. నగేష్ తెలిపారు. కారతీయ టైర్ ఫైటర్స్ అసోసియెషన్ (యూనియన్) ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో వారు గోడు వెళ్ళబోసుకున్నారు. 40 సంవత్సరములుగా చేతి వృత్తి అయిన పంచర్ షాపుల ద్వారా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ, లైసెన్సలు తీసుకొని జీవనోపాది పొందుతున్నాం, కరోనా లాక్ డౌన్ తరువాత 4 సంవత్సరాల నుండి స్థానికేతరులు వచ్చి పెట్రోల్ బంకుల్లో స్ధిరపడి మా ఉపాది దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంకుల్లో సర్వీస్ పరంగా ఉచిత ఎయిర్ చెకప్ ద్వారా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాని, దానికి తోడుగా, పంచర్లు కూడా చేస్తూ మా కుటుంబాలు రోడ్డున పడేలా చేశారని వాపోయారు.

ఈ విషయమై పెట్రోల్ బంకుల్లో ఉన్న యాజమాన్యానికి మా సమస్యలు చెప్పిన కూడా వారు స్పందించడం లేదని, స్థానికేతరులు (బీహార్) వారు వారి సన్నిహితులతో కలిసి కొత్త షాపులు కూడా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో త్రినగరిలో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఉన్న అన్ని పంచర్ షాపులు తొలిగించి మా కుటుంబాలకు ఆదుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎండి ఖలీమ్, కోశాధికారి సిహెచ్ బిక్షపతి, రామచందర్, ఎస్కే జుబేర్, రవి, జాఫర్, ఎండి హతీఫ్, ఎండి ఫజల్, ఎలుదండి నవీన్, ఎండి రఫిక్, మట్ల రవి, ఎండి గఫర్, మేకల సునీల్, మెరుగు రాము, యాకూబ్ పాష, శ్రవణ్ పాల్గొన్నారు.