21-08-2025 12:50:20 PM
ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన కానిస్టేబుళ్లు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును మోసం చేసిన అభ్యర్థులు.
హైదరాబాద్: కానిస్టేబుల్ అభ్యర్థులు తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును(Telangana Police Recruitment Board) బురిడీ కొట్టించారు. తప్పుడు సర్టిఫికేట్లతో కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారు. నకిలీ బోనఫైడ్ సర్టిఫికేట్లు ఇచ్చిన 59 మందిపై పోలీస్ శాఖ ఫిర్యాదు చేసింది. 59 మంది ఇప్పటికే ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగం పొందారు. 59 మంది నకిలీ పత్రాలపై సీసీఎస్ లో ఫిర్యాదు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.