21-08-2025 01:41:32 PM
ఓయూ డాక్టరేట్ ప్రధానం
వెంకంపాడు గ్రామ దళితుడికి దక్కిన గౌరవం
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం(Maripeda Mandal) వెంకంపాడు గ్రామానికి చెందిన తప్పెట్ల మైసయ్య, ఇద్దమ్మ దంపతులకు పదిమంది సంతానం. అందులో చిన్న కుమారుడు తప్పెట్ల నరేందర్ చిన్నప్పటినుండి చదువుపై మక్కువ పెంచుకోవడంతో తల్లిదండ్రులు, అన్నల సహకారంతో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు వెంకంపాడు ప్రాథమిక పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు, సీతారాంపురం బంగ్లా ఉన్నత పాఠశాల 8 నుండి 10వ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్ నరసింహులపేటలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. సూర్యాపేటలో ఇంటర్, డిగ్రీ పాల్వంచలో పూర్తిచేసి ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) పీజీ సెంటర్ వనపర్తిలో పీజీ, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేశారు. నరేందర్ విద్యా బ్యాసం మొత్తం ప్రభుత్వ హాస్టల్లోనే గడిచింది. అంతేకాకుండా పరిశోధన సమయంలో తెలంగాణ ఉద్యమంపై పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు.
బర్రెల కాపరి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పట్టా
తప్పెట్ల నరేందర్ తల్లితండ్రుల కష్టాలను చూసి తను కూడా వాళ్లకు వ్యవసాయంలో తల్లిదండ్రులకు, సోదరులకు చేదోడు వాదోడుగా నిలిచేవాడు. బాల్య దశలోనే తల్లిదండ్రులను కోల్పోవడం వలన విద్యాభ్యాసం సమయంలో తప్పేట్ల నరేందర్ అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పుడు తన విద్యా ఖర్చులకోసం అతను హైదరాబాద్ లో హోటల్లో పనిచేసి పైకాన్ని సమకూర్చుకునేవాడు. అలా తన విద్యా కోసం తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని మంగళవారం 84వ స్నాతకోత్సవం సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ ఓయూ వీసీ చేతుల మీదుగా వృక్షశాస్త్రం విభాగంలో పీహెచ్డీ పట్టా అందుకున్నాడు. పిహెచ్డి పట్ట పొందిన సందర్భంగా పుట్టిన ఊరు వెంకంపాడులో బహుజన నాయకులు ,దళిత నాయకులు, గ్రామ పెద్దలు, పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకోవడం జరిగింది.