calender_icon.png 21 August, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాకు సరిపడేంత యూరియాను కేటాయించండి

21-08-2025 11:18:52 AM

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కి ఎమ్మెల్యే వినతి 

గద్వాల,(విజయక్రాంతి):  గద్వాల జిల్లాకు సరిపడా యూరియాను కేటాయించాలని కోరుతూ గురువారం హైదరాబాద్ లోని మంత్రుల క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు( Minister Tummala Nageswara Rao) ను కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Bandla Krishna Mohan Reddy) వినతిపత్రాన్ని అందచేశారు. గద్వాల జిల్లాకు తక్షణమే తగినంత యూరియాను కేటాయిచాలని అదేవిదంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల గురించి వివరించి గద్వాల అభివృద్ధికి సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే  కోరారు. మంత్రి సానుకులంగా స్పందించి త్వరలోనే జిల్లాకు తగినంత యూరియాను అదేవిదంగా మిగతా సమస్యలను పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే  వెంట మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.