calender_icon.png 21 August, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద

21-08-2025 12:52:37 PM

మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు చేరువలో వరద గోదావరి నీటిమట్టం. 

అప్రమత్తమైన అధికారులు. 

భద్రాచలం నుండి చర్ల చత్తీస్గడ్ ఆంధ్ర ప్రాంతాలకు రహదారి బంద్. 

భద్రాచలం (విజయక్రాంతి):  భద్రాచలం వద్ద గోదావరి వరద(Godavari floods) ఉగ్రరూపంలో పొంగి ప్రవహిస్తున్నది. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు 51.20 అడుగులకు చేరుకున్నది. దీంతో మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు చేరువైంది. అదేవిధంగా మరికొంత సమయం పెరిగి సాయంత్రం వరకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు 43 అడుగులకు చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక రాత్రి 10 .5 గంటలకు 48 అడుగులు చేరుకోగానే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు అప్రమత్తమై సహాయ కార్యక్రమాలలో పాల్గొనటానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా పెరుగుతూ గురువారం ఉదయానికి 51.20 అడుగులకు చేదుకొని ఉగ్రరూపంలో ప్రవహిస్తున్నది.

దీంతో భద్రాచలం వద్ద 13, 24, 981 లక్షల నీరు దిగువకు ప్రవహిస్తున్నది. గురువారం ఉదయం భద్రాచలం నుండి చత్తీస్గడ్ వెళ్లే నేషనల్ హైవే గుండాల రాయనపేట మధ్యగల రోడ్డు  గోదావరి బ్యాక్ వాటర్ రోడ్డుపైకి ప్రవహిస్తున్నది. దీంతో చతిస్గడ్ ఒరిస్సా ఆంధ్ర ప్రాంతాలకు రహదారి మరి కొన్ని గంటలలో బంద్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా భద్రాచలం నుండి చర్ల వెంకటాపురం వాజేడు మీదుగా ఛత్తీస్గడ్ వెళ్లే మరో రోడ్డు దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద అప్రోచ్ రోడ్ గోదావరి వరదతో మునిగిపోయింది. దీంతో  రహదారి సౌకర్యం బంద్ అయింది. దీంతో వాహనాలను ఇతర మార్గాలకు అధికారులు మళ్లించినప్పటికీ ఆ రహదారి బాగా లేకపోవడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

అదేవిధంగా భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు పూర్తిగా వరద నీటితో మునిగిపోవడంతో భక్తులు లను గోదావరి స్నానానికి అనుమతించడం లేదు. ఇప్పటికే వరద సహాయక కార్యక్రమాలలో పాల్గొనటానికి రెండు లాంచీలను అధికారులు సిద్ధం చేశారు. అలాగే భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఐటీడీఏ పీవో ఆఫీస్ కలెక్టర్ రేట్లో కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం దేవాలయానికి అనుబంధంగా ఉన్న పాఠశాల రామాలయానికి వెళ్లే రహదారులు సైతం నీటిలో మునిగిపోయాయి. అలాగే సీతమ్మ వాగు విస్తృతంగా ప్రవహించడం వల్ల నార చీరల ప్రాంతం సీతమ్మ వారి సంచరించిన ప్రాంతాలు మునిగిపోయాయి. గురువారం నాడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గోదావరి కరకట్ట ప్రాంతంలోనూ, ముంపుకు గురయ్యే ప్రాంతాలలో పర్యటించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పంచాయతీ అధికారులను ఆదేశించారు.