calender_icon.png 17 August, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్ప- 2 బెన్ ఫిట్ షోలను రద్దు చేయాలి

05-12-2024 03:26:09 PM

అల్లు అర్జున్ రావడంతోనే తీవ్ర తొక్కిసలాట..

చనిపోయిన మహిళ కుటుంబానికి  ఎక్స్ గ్రేసియా ఇవ్వాలి

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి.

సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి

డివైస్ ఆధ్వర్యంలో థియేటర్ ముందు ఆందోళన 

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో భారీ సినిమాల బెన్ ఫిట్ షోలను రద్దు చేయాలని, అల్లు అర్జున్ రావడంతోనే సంధ్య థియేటర్ వద్ద బుధవారం తొక్కిసలాట జరిగిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి, టీ నాగరాజు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అన్నారు. గురువారం సంధ్య థియేటర్ ఎదురుగా ఆ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుష్ప 2 సినిమా విడుదల సందర్బంగా ప్రదర్శించిన బెనిఫిట్ షో కు సినిమా నటుడు అల్లు అర్జున్ రావడం, ఆయనను చూసేందుకు ప్రజలు ఒకే సారి గుమిగూడటంతో పోలీస్ లాఠీ చార్జీ చేయడం వల్ల తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిందని ఆరోపించారు. శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగా ఉందని, శాన్వి అనే పిల్లలు హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారని, ఈ కుటుంబానికి ప్రభుత్వం, సినిమా నిర్మాతలు ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వం భారీ సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం, ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం వలన వినోదానికి బదులు విషాదాలు నిండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకుండా చట్టం తేవాలని డిమాండ్ చేశారు.  నటుడు అల్లు అర్జున్ బెనిఫిట్ షోలకు అభిమానులు భారీగా వస్తారని అంచనాలు ఉన్న వచ్చి ఒకరి ప్రాణాల పోవడానికి కారణమయ్యాడు. ఆయనపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. పోలీసులు చిన్నచిన్న సంఘటనలకే లా అండ్ ఆర్డర్ అంటారని భారీ క్రేజ్ ఉన్న సినిమాలు వారి అభిమాననటులు పర్యటనలకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఉండాలి. కానీ అల్లు అర్జున్ వచ్చి భారీగా ప్రజలు గుమిగూడేలా చేసి, పౌరుల ప్రాణాలు పోయేలా చేసిన చర్యలను సుమోటాగా తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

తొక్కిసలాటలో చనిపోయిన రేవతి అనే మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం, సినిమా నిర్మాతలు ఆదుకోవాలని, వారి పిల్లలు కూడా చావు బ్రతుకుల పోరాటాన్ని కొనసాగిస్తున్నారని, వారి కోసం మెరుగైన వైద్యాన్ని అందించాలని, చనిపోయిన మహిళా కోసం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా అందించాలని అన్నారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకత్వాన్ని పోలీసులు అరెస్టు చేయడంతో  ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. నాయకులను అరెస్టు చేసి కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ , రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ రెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావేద్,  డివైఎఫ్ఐ హైదరాబాద్ అధ్యక్షులు హస్మీబాబు, రాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, రమేష్ , రమ్య , ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు విగ్నేష్, నాగేందర్, సహన,  రజనీకాంత్, ప్రశాంత్ , మనోజ్,  లక్ష్మణ్ , రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.