12-09-2024 05:01:05 PM
న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం మృతిపట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ... సీతారాం మరణించారని తెలిసి బాధగా ఉందన్నారు. ప్రముఖ పార్లమెంటేరియన్ అని, ఏచూరి మరణం జాతీయ రాజకీయాలు తీరని లోటని మమత బెనర్జీ తెలిపారు. ఏచూరి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆగస్టు 19న ఊపిరితిత్తుల సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఏచూరి గురువారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.