17 April, 2026 | 6:57 PM

కొత్తకోట ప్యూపిల్స్ హైస్కూల్ కరస్పాండెంట్‌ కు ఉత్తమ కరస్పాండెంట్ అవార్డు

17-10-2025 04:49 PM

కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట ప్యూపిల్స్ హైస్కూల్ కరస్పాండెంట్‌ డా.ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డికి లీడ్ ఇండియా ఫౌండేషన్‌ సంస్థ “ఉత్తమ కరస్పాండెంట్ అవార్డు”ను ప్రదానం చేసింది. ఈ అవార్డును రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా డా. ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి కి అందజేశారు. భారత దేశ 11వ రాష్ట్రపతి డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారికి 94వ జయంతి సందర్భంగా నిర్వహించిన “లీడ్ ఇండియా 2047 – విశ్వ గురు భారత్” కార్యక్రమంలో ఈ గౌరవాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని డా. ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  ఎద్దుల కృష్ణవేణి  డైరెక్టర్‌  ఎద్దుల చంద్రహాస్,  ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసి, డా. రాజ వర్ధన్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.