15 April, 2026 | 6:53 PM

సీపీఆర్ పై విద్యార్థులకు అవగాహన

17-10-2025 04:45 PM

చిట్యాల,(విజయ క్రాంతి): నో టోబాకో డేను పురస్కరించుకొని జడ్పిహెచ్ఎస్ వట్టిమర్తి పాఠశాలలో సీపీఆర్ పై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్యాల మండలం వట్టిమర్తి జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎన్.యాదయ్య మాట్లాడుతూ... హార్ట్ ఎటాక్ వచ్చిన వాళ్లకు ఏ విధంగా సీపీఆర్ చేయాలనే విషయంపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించామన్నారు. సిపిఆర్ చేయడం వల్ల ఒక మనిషి ప్రాణం కాపాడవచ్చని తెలిపారు. అదేవిధంగా పొగాకు వాడటం వల్ల  క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని, పొగాకు సంబంధిత ఉత్పత్తులకు దూరంగా ఉండాలని  విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.