బీసీ బందుకు మాల మహానాడు సంపూర్ణ మద్దతు
17-10-2025 04:54 PM
జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ
చేర్యాల: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం శనివారం జరుగుతున్న బీసీ బందుకు మాల మహానాడు పూర్తి మద్దతు ప్రకటించిందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్బంగా చేర్యాలలో విలేకరులతో మాట్లాడుతూ... 5శాతం ఉన్న ఓసిలు 10 శాతం రిజర్వేషన్ పొందుతే అత్యధిక జనాభా ఉన్న బీసీలకు 42 శాతం తప్పు కాదని బీసీల పోరాటం న్యాయబద్ధమని పేర్కొన్న ఆయన రేపు జరుగుతున్న బంద్ లో మాల మహానాడు నాయకులు కార్యకర్తలు పాల్గొనవలసిందిగా కోరారు.






