22 June, 2026 | 7:50 PM

Breaking News

కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •  

కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఉత్తమ సేవల పురస్కారాలు

27-01-2026 12:00 AM

కామారెడ్డి, జనవరి 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులను సోమవారం ఘనంగా సన్మానించారు. జిల్లా నుంచి అత్యుత్తమ సేవలు అందించిన 9 మంది ఉద్యోగులకు విద్యుత్ శాఖ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగుల పురస్కారాలు అందుకున్నారు. కామారెడ్డి జిల్లాలో విశేష సేవలు అందించిన 21 మంది ఉద్యోగులకు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. గత సంవత్సరం సంభవించిన ఆకస్మిక వరదల సమయంలో అంకితభావంతో విధులు నిర్వహించి విశేష సేవలు అందించిన 230 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులకు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, కామారెడ్డి  రవీందర్  చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.