calender_icon.png 27 January, 2026 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మువ్వన్నెల రెపరెపలు

27-01-2026 12:00:00 AM

నిజామాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు.  అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పుర ప్రముఖులకు కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ, అటవీ, డెయిరీ, పశువైద్య, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, నీటి పారుదల, మిషన్ భగీరథ, ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. విస్డమ్ హైస్కూల్ విద్యార్థులు తల్లీ భారతి వందనం గేయంపై, వసుధ హైస్కూల్ చిన్నారులు శంభాజీ మహరాజ్ శౌర్య పరాక్రమం గురించి, విజయ్ హైస్కూల్ పాఠశాలకు చెందిన బాలబాలికలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాల్సిన ప్రాముఖ్యత గురించి చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. డిచ్ పల్లి మానవతా సదన్ విద్యార్థిని విద్యార్థులు ఒకే శృతిలో డప్పు వాయిస్తూ తమ కళా నైపుణ్యాన్ని చాటారు.

ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్, సీ.పీతో పాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి మెమోంటోలు, ప్రశంసా పత్రాలను బహూకరించి ప్రత్యేకంగా అభినందిం చారు. స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, డీఎస్‌ఓ అరవింద్ రెడ్డి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. క్యాంపు ఆఫీసులో, జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఆవిష్కరించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో... 

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

రాజ్యాంగ విలువలను కాపాడుతూ పని చేయాలి

కామారెడ్డి, జనవరి 26 (విజయక్రాంతి): రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాసేవలో నిబద్దతతో పనిచేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,  జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది  ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి భావాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ  సూచించారు.

ప్రగతి పథంలో కామారెడ్డి జిల్లా ముందంజ 

కామారెడ్డి, జనవరి 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా అభివృద్ధి పథంలో ముంద ంజలో ఉందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి స్వీకరించారు. అనంతరం శకటాల ప్రదర్శన వీక్షించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన అధికా రులకు ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించారు.   జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ మధుమోహన్, ఎస్పి రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, జెడ్పి సీఈవో చందర్ నాయక్, ఆర్డిఓ వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు రాజు, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా కోర్టు కార్యాలయంలో జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్, ఆర్డీవో కార్యాలయం ఎదుట వీణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, బిజెపి జిల్లా కార్యాలయం ఎదుట బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, బిఆర్‌ఎస్ కార్యా లయం ఎదుట పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాల ఎదుట జాతీయ జెండాలు నెరవేశారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట టిపిసిసి కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, వివిధ కుల సంఘాలు, జాతీయ జెండాలను ఎగరవేశారు.

టీఎన్జీవోస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో

నిజామాబాద్, జనవరి 26 (విజయ క్రాంతి): టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని టీఎన్జీవోస్ భవన్  ఆవరణలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని నగరంలోని ఆయన స్వగృహంలో టీఎన్జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎన్జీవోస్ పక్షాన.. ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పూల మొక్కను అందజేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, జిల్లా సహాధ్యక్షుడు చిట్టి నారాయణ రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా ముఖ్య సలహాదారు వనమాల సుధాకర్, కేంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

తిలక్ గార్డెన్ టెనెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ తిలక్ గార్డెన్ టెనెట్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో పథకావిష్కరణ జరిగింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ ఆధ్వర్యంలో   నాయకులు పతాకావిష్కరణ చేశారు.

బుక్కులు, పెన్నులు అందజేత

బాన్సువాడ, జనవరి 26 (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట గ్రామంలోనీ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు సోమవారం బుక్కులు పెన్నులు, సౌండ్ బాక్స్ మౌత్ పీస్ ను కాంగ్రెస్ యువ నాయకుడు గాజుల రాజేశ్వర్ మోటార్స్ షోరూం కొయ్య గుట్ట  కాలనీ వాసుల సమక్షంలో అందజేయడం జరిగింది.   

న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో..

నిజామాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం రోజు న్యాయవాది పరిషత్  నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సరస్వతి నగర్ లో గల సంస్థ కార్యాలయం వద్ద న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరిచరు.  న్యాయవాదులు బండారి కృష్ణానంద్  సి సాయి రెడ్డి నరేధర్ రెడ్డి పిండం రాజు విగ్నేష్ ఉదయ్, కృష్ణ, బిట్ల రవి, నారాయణ దాస్, శ్రీధర్, బైరిగణేష్  చౌదరి, సుభాష్ రెడ్డి, డి సురేష్, నాగేష్, సుజిత్, సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.

భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో..

భిక్కనూర్, జనవరి 26(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సిఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఎస్‌ఐ ఆంజనేయులు, టీపీసీసీ సెక్రటరీ ఇంద్రకీరన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చాంద్రకాంత్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..

నాగిరెడ్డిపేట్, జనవరి 26 (విజయ క్రాంతి): నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు మండల కేంద్రంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి,ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య, సీనియర్ నాయకులు సంజీవులు, రామచంద్రారెడ్డి, కిష్టాపూర్, బెస్త సాయిలు, గంపల వెంకన్న, ఫారూఖ్, ఈమామ్, సాయ గౌడ్, హనుమాన్లు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి పట్టణంలో..

ఎల్లారెడ్డి, జనవరి 26 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా పతాకావిష్కరణ రెపరెపలాడింది. ఎల్లారెడ్డి పాటారంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ పతాకావిష్కరణ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ప్రేమ్ కుమార్ పథకావిష్కరణ చేశారు. ఎల్లారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి పతాకావిష్కరణ చేశారు. ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ పార్థసింహారెడ్డి పతాకావిష్కరణ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పతాకావిష్కరణ ఘనంగా నిర్వహించి స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన వీరుల గురించి పలు సందేశాలు ఉపన్యాసాలు తెలియపరిచారు.

ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో 

ఎల్లారెడ్డి, జనవరి 26 (విజయక్రాంతి) : ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి డైరెక్టర్లతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పతాకావిష్కరణ అనంతరం, పాలువురు డైరెక్టర్లకు మెమొంటోళ్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారం పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నలగడ్డ రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో.. 

కామారెడ్డి, జనవరి 26(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను తహసిల్దార్ సుధాకర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఎక్సైజ్ సిఐ మధుసూదన్ రావు, ఎక్సైజ్ ఎస్ ఐ దీపిక , పోలీసు సిబ్బంది, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది , గ్రామ ప్రజలు పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తు చేసుకున్నారు.