calender_icon.png 30 October, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన విద్యుత్ సదుపాయాలు కల్పించాలి

30-10-2025 01:46:18 AM

టీజీఎస్పీడీసీఎల్ సీఎండీని కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

మల్కాజిగిరి, అక్టోబర్ 29(విజయక్రాంతి) : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారుఖీని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్ ప్రాంతంలో పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు మెరుగైన విద్యుత్ సదుపాయాలు కల్పించాలంటూ వినతిపత్రం సమర్పించారు. సీఎండీ ముషారఫ్ ఫారుఖీ సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, జెఎసి వెంకన్న, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.