calender_icon.png 30 October, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజరుద్దీన్‌‌కు మంత్రిపదవి: ఈసీకి బీజేపీ ఫిర్యాదు

30-10-2025 01:39:39 PM

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని(State Chief Electoral Officer Sudarshan Reddy) బీజేపీ నేతలు కలిశారు. మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వవద్దని సీఈవోకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఒక వర్గం ఓట్ల కోసమే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టారని బీజేపీ(Bharatiya Janata Party) ఆరోపించింది. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ లో పోటీ చేశారని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణను ఆపాలని సీఈవోను కోరారు.

''జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఒక వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ కి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై బీజేపీ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, ఓటర్లను ప్రభావితం చేసే దుష్ప్రయత్నంగా పేర్కొంటూ బిజెపి ఎన్నికల సంఘానికి అధికారిక ఫిర్యాదు సమర్పించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ అనైతిక చర్యలను తక్షణమే అడ్డుకోవాలని బిజెపి డిమాండ్'' చేస్తూ ఎక్స్ లో పోస్ట్  చేసింది.