calender_icon.png 13 February, 2026 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు

13-02-2026 01:09:20 AM

  1. రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీలతో సీఎం రేవంత్
  2. అగ్రనేతలకు ఫలితాల నివేదికలు అందజేత
  3. సీఎంను అభినందించిన అధిష్ఠానం పెద్దలు 

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) :  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సా ధించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలకు వివరించారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్ని కల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆశాజనక ఫలితాలు సాధిస్తుందని సీఎం ధీ మావ్యక్తం చేశారు. లోక్‌సభలో విప క్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి బుధ, గురు వారాల్లో వేర్వురుగా భేటీ అయ్యా రు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70 శాతానికి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయని, విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. అందుకు సం బంధించిన నివేదికలను సీఎం అగ్రనేతలకు అందజేశారు. ఇక 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు బుధవారం జరిగాయని, శుక్రవారం ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబడుతుందని ధీమా వ్యక్తం చేశా రు. 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేత వంటి కార్యక్రమాల అమలుతో ప్రభు త్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని వివరించారు.

ఉద్యోగ ని యామకాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు, పార్టీ.. ప్రభుత్వం మధ్య సమన్వయం.. చేసిన పనులను వివరించేందుకు సభల ఏర్పాటుతో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై పూర్తి సానుకూలత ఉందని అగ్ర నేతలకు సీఎం రేవంత్ తెలిపారు. క్షేత్ర స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడంపై అధిష్ఠానం పెద్దలు ముఖ్యమంత్రిని అభినందించారు.