4 April, 2026 | 7:37 AM

నీటి సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు

13-02-2026 01:08 AM

లింగాపూర్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మండలంలోని జాములధ్రా గ్రామ పంచాయతీ పరిధిలోని మోతిగూడ గ్రామా న్ని కలెక్టర్ కే.హరిత గురువారం సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. తాగునీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం సమర్పించగా, చట్టపరమైన పరిమితులను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అటవీ కోర్ ఏరియా నిబంధనలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మార్గాలు అన్వేషిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్, జైనూర్ సీఐ రమేష్, లింగాపూర్ ఎస్‌ఐ గంగన్న, రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది, డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణ, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.