calender_icon.png 21 November, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసారి మెరుగైన ఫలితాలు

27-07-2024 03:31:52 AM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లు ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తారని మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ‘కొన్నేళ్లుగా మన అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన మనం ఈసారి రెట్టింపు పతకాలు చూసే అవకాశముంది. బాక్సింగ్ క్రీడలో పురుషుల కన్నా మహిళా బాక్సర్లు ఎక్కువగా ఉండడం శుభసూచకం. బాక్సింగ్ నుంచి మనకు కనీసం రెండు పతకాలు వచ్చే అవకాశముంది. గట్టిగా ప్రయత్నిస్తే పసిడి వచ్చే అవకాశముంది. నిఖత్ జరీన్, లవ్లీనాలు తమ ఫామ్‌తో పతకాలపై ఆశలు రేపుతున్నారు’ అని విజేందర్ పేర్కొన్నాడు.