14 June, 2026 | 2:33 PM

Breaking News

తుమ్మన్‌పేటకు బయలుదేరాం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తాం   •   పటేల్ ప్రధాని కావాల్సింది: ఎంపీ లక్ష్మణ్   •   అధైర్య పడొద్దు.. రైతుల పండగ ప్రభుత్వం   •   వర్ష నష్ట ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఎంపీ   •   శ్రీ ఉమామహేశ్వరంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు   •   బంజీ జంప్ సిబ్బంది నిర్లక్ష్యం.. 21 ఏళ్ల యువతి మృతి   •   మహిళల టీ20 ప్రపంచకప్: నేడు భారత్-పాకిస్థాన్ మధ్య పోరు   •   ఇరాన్ తో శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన   •   ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బెల్లంపల్లి సమస్యలు   •   అయ్యగారి చెరువు సుందరీకరణ కోసం, రాత్రి, పగలు శ్రమించి పనులు పూర్తి చేయాలి   •  

ప్రేమతో నాన్నకు ఉగాది నంది పురస్కారాలు

22-02-2026 05:58 PM

ఉత్తమ నటుడిగా నిర్మల్ వాసి

ఉత్తమ నటి సుహాసిని

ఉత్తమ చిత్రం ప్రేమతో నాన్న 

ఉత్తమ నటుడు డాక్టర్ వేణుగోపాలకృష్ణ

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ నటించి దర్శకత్వం వహించిన లఘు చిత్రం ప్రేమతో నాన్న రెండవ భాగం, మొదటి చిత్ర భాగం ప్రేమతో నాన్నకి ఇది వరకే మంచి గుర్తింపు, ఉత్తమ పురస్కారంలు అందుకున్నది. డాక్టర్ వేణు గోపాలకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెన్డెంట్ గా మంచి సేవలందించి పలు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నారు. ప్రేమతో నాన్న చిత్రం కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు, సామాజిక స్పృహతో కూడిన బాధ్యతల నేపధ్యంలో నిర్మించారు మానవ సంబంధాలున్న మంచి కదాంశం ప్రేమతో నాన్న అని ప్రశంసించారు.

ఉత్తమ చిత్రంతో పాటు ప్రేమతో నాన్నలో నటించిన డాక్టర్ సుహాసిని, డాక్టర్ వేణుగోపాలకృష్ణ ఉత్తమ నటి, నటులుగా ఎంపికయ్యారు. తండ్రి కూతురు అయిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ,డాక్టర్ సుహాసిని  ఇద్దరూ వైద్యులు, నటులు అనేది విశేషం. హైదరాబాద్ బిర్లా ఆడిటోరియం లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలు అందజేస్తామని  నిర్వాహకులు మెగా ఎంటర్ప్రెజెస్ వారు తెలియజేశారు. డాక్టర్ సుహాసిని, డాక్టర్ వేణు గోపాలకృష్ణలను పలువురు అభినందించారు.