calender_icon.png 22 February, 2026 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం

22-02-2026 03:44:47 PM

కడెం,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం ఐదవ తరగతి టీజీ సెట్ 2026 గురుకుల ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని స్థానిక గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సిహెచ్ శకుంతల తెలిపారు. ఈ పరీక్ష కేంద్రంలో 262 మంది బాలురు పరీక్ష రాయవలసి ఉండగా 255 మంది విద్యార్థులు పరీక్షలకు హాజర‌య్యార‌ని తెలిపారు.

అలాగే 266 మంది బాలిక‌లు పరీక్ష రాయాల్సి ఉండగా 257 మంది పరీక్షకు రాసిన‌ట్లు చెప్పారు. ఈ పరీక్షా కేంద్రంలో మొత్తం 512 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగిందని 16 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని 97 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు. డీఓ కవిత పర్యవేక్షణలో పరీక్షను పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీఎస్ ఎస్ఐ సాయి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.