calender_icon.png 14 May, 2025 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో మెరుగైన సేవలు

14-05-2025 12:02:33 AM

సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించా రు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మం గళవారం సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభు త్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం, చక్కని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

విద్యార్థులకు కా స్మోటిక్ ఛార్జీలను నేరుగా వారి బ్యాంక్ ఖా తాల్లోనే జమ చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. డెబిట్ కార్డు తరహా లో స్మార్ట్‌కార్డును అందించడం వల్ల విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడుతుందన్నారు.

రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి హాస్టళ్లకు సరిపడా నాణ్యమైన సరుకులు, పుస్తకాలు సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలను సిద్ధం చే యాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షే మ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి, సెర్ప్ సీఈఓ దివ్య, బీసీ వెల్ఫేర్ కార్యదర్శి ఈ శ్రీధర్ పాల్గొన్నారు.