22-08-2025 12:52:01 PM
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) వాదనలు ముగిశాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించిన తరువాతనే తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), హరీష్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై(Kaleshwaram Commission Report) మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు అందించారు. అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకెళ్తామని సీజే ధర్మాసనానికి ఏజీ తెలిపారు. కమిషన్ నివేదికను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. నివేదిక వైబ్ సైట్ లో ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విచారణను 5 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.