calender_icon.png 22 August, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడుల పేరుతో మోసం.. ఆరుగురు అరెస్ట్

22-08-2025 01:26:15 PM

హైదరాబాద్: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ అయింది. ఆరుగురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు(Cybercrime police) అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు మోసగించినట్లు గుర్తించారు. స్టాక్ మార్కెట్లతో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని మోసం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన మహిళ నుంచి రూ. 1.05 కోట్లను ముఠా కాజేసింది. రూ. 6.05కోట్లు లాభాలు వచ్చాయని యాప్ లో చూపి మోసం చేసినట్లు బాధితురాలు వాపోయింది. ఇన్ స్ట్రాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా బాధితుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. ఏటీఎం కార్డులు, మ్యూల్ ఖాతాల ద్వారా నగదు లావాదేవీలు చేసినట్లు గుర్తించారు.