calender_icon.png 14 May, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత సైనిక పాటవాన్ని గుర్తించిన ప్రపంచం

15-05-2025 12:00:00 AM

  1. దేశ ప్రజలందరి తరఫున జవాన్లకు ప్రధాని మోదీ అభినందనలు
  2. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): పాకిస్థాన్‌పై అత్యంత సాహసోపేతంగా మెరుపుదాడి చేసి అక్కడి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన మన సైనికులను ప్రధాని మోదీ ఆదంపూర్ వెళ్లి అభినందించడం ఎంతో గొప్ప విషయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశప్రజలందరి తరఫున మన హీరోలను ఆయన అభినందించిన తీరు అత్భుతమని మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

అధర్మాన్ని నాశనం చేసి, ధర్మాన్ని స్థాపించడం కోసమే తాము ఆయుధాలను వినియోగిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. పాక్ ఉగ్రమూకల ఆర్తనాదాలు చూస్తుంటే ఆపరేషన్ సిందూర్ విజయవతమైందన్న విషయం స్పష్టమవుతుందన్నారు. పాక్ భూభాగంలో దాడులు చేయడమే కాకుండా, అక్కడి నుంచి మన దేశంపైకి దండెత్తి వస్తున్న వారిపైనా దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసి, మన సైనిక సత్తా నిరూపించామన్నారు.

మన సైనిక పాటవాన్ని ప్రపంచం గుర్తించిందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో ఇకపై చర్చలుంటే ఉగ్రవాదంపైన లేదా పీఓకేను మనకు స్వాధీనం చేయడం పైనే ఉంటాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, మన దేశ నిఖార్సైన వైఖరికి నిదర్శమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.