calender_icon.png 17 August, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగ్రత్తగా అక్రమ పేలుడు పదార్థాలు

05-12-2024 01:35:48 PM

శ్రీకృష్ణ స్టోన్ క్రషర్ కంపెనీ చట్ట విరుద్ధంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన వైనం

సమాచారం రావడంతో తనిఖీ చేసి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గండీడ్ : పేలుడు పదార్థాలను ఎలాంటి జాగ్రత్తలు వహించకుండా అక్రమంగా ఓ పురాతన ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా లోని గండీడ్ మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామ శివారులో గల లైసెన్సు ఉన్న శ్రీ కృష్ణ స్టోన్ క్రషర్ కంపెనీ వారు అక్రమంగా, చట్ట విరుద్ధంగా పేలుడు పదార్థాలను ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నిల్వంచినారని సమాచారం వచ్చింది.

అట్టి ప్రదేశాన్ని. తనిఖీ చేయగా క్రషర్ కంపెనీ వద్ద ఒక గదిలో పేలుడు సామాగ్రిని నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా నిలువ ఉంచారు.  సైట్ మేనేజర్ శ్రీకాంత్ గౌడ్,  భవాని ఎక్స్ప్లోసిస్ ఏజెన్సీ వారు నిల్వ ఉంచినట్లు గుర్తించి, పేలుడు పదార్థాలను స్వాధీన పరచుకుని లైసెన్సు ఉన్నా గాని పేలుడు పదార్థాలను అజాగ్రత్తగా నిలువమైనదిటినందున వారి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. నిలువ ఉంచిన అక్రమ పేలుడు పదార్థాలు ఐడియల్ పవర్ 90 స్టిక్స్ 12 కాటన్ లు, 400 విడి ప్యాకెట్లు, ఆరు కాటన్ లో కార్డెక్స్ వైర్లు బాక్సులు, డేటా నేటర్లు. స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.