05-12-2024 01:33:21 PM
అవినీతి నిరోధక వారోత్సవాల ర్యాలీ ప్రారంభించిన -జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్, (విజయక్రాంతి): అవినీతిని పూర్తిగా నిరోధించినప్పుడే మెరుగైన సమాజం రూపుదిద్దుకుంటుందని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఈనెల 9వ తేదీ వరకు అవినీతి నిరోధక వారోత్సవాలలో భాగంగా ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పోలీస్ లైన్ స్కూల్ నుండి తెలంగాణా చౌరస్తా వరకు అవినీతికి వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఏసీబీ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. అవినీతి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు.
సమాజంలో పారదర్శకతను పెంపొందించేందుకు పౌరులంతా కలిసి పనిచేయాలన్నారు. అవినీతిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. అవినీతికిత ఇవ్వకుండా అందరికీ మేలు చేసే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పారదర్శకత మెరుగైన సమాజం అవినీతి రహితంగానే ముందుకు సాగితే ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, లింగస్వామి, ఎంఈవో లక్ష్మణ్ సింగ్, పోలీస్ లైన్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ శంభుప్రసాద్, ఆర్వీఎంఓ, బాలు యాదవ్, ఏసీబీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.