9 July, 2026 | 12:59 AM

నైట్ షిఫ్ట్ చేస్తున్నారా జాగ్రత్త!

13-05-2024 12:05 AM

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా రోజువారీ అలవాట్లు క్రమపద్ధతిలో ఉండాలి. ఒక వేళ రోజువారీ ఆహారపు అలవాట్లలో ఏ చిన్న మార్పు వచ్చినా ఆరోగ్యం మీద ప్రభావం కచ్చి తంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు, దినచర్య మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని, ఇప్పటికే పలు అధ్యయనాల ద్వారా తెలిసింది. దీంతో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి, జంక్ ఫుడ్, సమయానికి తినకపోవడం వల్ల వృద్ధాప్యంలో రావాల్సిన వ్యాధులు యుక్త వయసులోనే వస్తున్నాయి. ఇది ఒక వైపు అయితే మరోవైపు ఉరుకుల పరుగుల ఆధునిక మనిషి జీవితంలో నైట్ షిఫ్ట్‌లు ఓ భాగమైపోయాయి. వరుసగా నైట్ షిఫ్టులు చేసినట్లయితే ఆరోగ్యం పాడవడం ఖాయమని వైద్యులు అంటున్నారు.  నైట్ షిఫ్టులతో మధుమేహం, ఊబకాయమే కాకుండా అనేక వ్యాధులు మనల్ని చుట్టుముట్టే అవాకాశాలున్నట్టుగా తాజా పరిశోధనలో తెలింది.

పరిశోధనలోని అంశాలు

అమెరికాకు చెందిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో విస్తు పోయే విషయాలు బయటపడ్డాయి. ప్రొటీన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకులు ఆసక్తికరమైన అంశాల గురించి ప్రస్తావించారు. నైట్ షిఫ్టుల వల్ల రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రంచే ప్రోటీన్ రిథమ్స్ దెబ్బతింటాయని, దీంతో జీవక్రియను అడ్డుకొని వాటి పరిస్థితులను ప్రభావితం చేస్తుందని తెలిసింది. వరుసగా మూడు నైట్ షిఫ్ట్‌లు చేస్తే శరీర జీవక్రియకు అంతరాయం కలిగించి, ఆరోగ్యాన్ని పాడుచేస్తాయని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో తేలిన అంశాలతో నైట్‌షిఫ్ట్ చేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్యపరమైన టెక్నిక్స్ ఉపయోగిస్తే నైట్‌షిఫ్ట్ ఉద్యోగులు కొంతలో కొంతైన ఆరోగ్యం కాపాడు కోవచ్చు.

ఆరోగ్యకంగా ఉండాలంటే..!

నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు కచ్చితంగా డ్యూటీ సమయంలో కొన్ని  మధ్యమధ్యలో కాస్తంత కునుకు తీస్తుండాలి. పని సమయం అయిపోయిన తర్వాత ఫోన్‌కు, టీవీకి అతుక్కుపోకుండా నిద్రపోవాలి. సరైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి సరిపడా నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతీరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అల్కాహాల్‌కు దూరంగా ఉండడం మంచిది. ప్రతీ ఉదయం సూర్యరశ్మి కోసం కొంతసేపైనా ఎండలో ఉండాలి. నైట్‌షిఫ్ట్ వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.