calender_icon.png 5 May, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోసాల పట్ల జాగ్రత్త

12-04-2025 12:00:00 AM

నాగారం , ఏప్రిల్ 11: ప్రజలందరూ, సైబర్ నేరాలు , డ్రగ్స్ మత్తు మందుల  రోడ్డు ప్రమాదాల నివారణ పైఓ టీ పి ల ద్వారా జరిగే అన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నాగారం ఎస్ ఐ ఐలయ్య సూచించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ కళాజాత బృందం అవగాహన సదస్సు లో పాల్గొని మాట్లాడుతూ యువత గంజాయి, మద్య పానం లాంటి చేసి వ్యసనాలకు గురి కాకుం డా వారి ఉజ్వల భవిష్యత్తు కోసం తమ పై చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

యువత అసాంఘిక కార్యక్రమములలో పాల్గొన వద్దు అన్నారు.వ్యక్తి గతమైన పార్టీల గ్రూప్ లకు సంబంధించి సమాచారం రెచ్చ గొట్టే  కథనాలు పోస్ట్ చేసి ప్రజా శాంతికి భంగం కలగజేసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో ప్రజా భరోసా నిర్వహిస్తు న్నాము. హెడ్ కానిస్టేబుల్ వెంకన్న నరేష్ శ్రీనివాస్ కమలాకర్ వీరన్న  ఎల్లయ్య గోపయ్య కృష్ణ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.