12-04-2025 12:00:00 AM
నల్లగొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా నెలరోజులపాటు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరైనా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని సూచించారు.
శాంతి భద్రతలకు భంగం కలిగేలా, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటివారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.