షావర్మతో జాగ్రత్త...!
స్నేహితులతోనో ఇంట్లోవారితోనో బయటికి వెళ్లినప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటాము. ఈ మధ్య ఎక్కువగా ఫాస్ట్‌ఫుడ్, షావర్మలాంటి వాటిని ఇష్టపడి ఎక్కువగా తింటున్నారు. షావర్మా అనేది ఈ మధ్య చాలా చోట్ల దొరుకుతుంది. చాలా మంది దీన్ని రోడ్ల పక్కన బండ్లపై లేదా హోటల్స్‌లో అమ్ముతుంటారు. బండ్లపై అమ్మేదాన్ని తింటే ఆరోగ్యాన్ని కోరిమరీ పాడు చేసుకున్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షావర్మాలో కాల్చిన మాంసపు ముక్కలను, వెజిటేబుల్స్‌ను, మాయోనిస్ లాంటివి వేసి అమ్ముతారు. మాంసం సరిగ్గా ఉడికితే పర్వాలేదు కానీ ఒకవేళ ఉడకకపోతే అందులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని బాగా ఉడికితేనే తినాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదం ఉంది. కనుక షావర్మా తినేవారు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.






